రాఘవేంద్రుడి సన్నిధిలో కర్ణాటక మాజీ సీఎం
ABN , Publish Date - May 01 , 2025 | 11:42 PM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, కుమారుడు శివమొగ్గ ఎంపీ రాఘవేంద్ర కుటుంబ సమేతంగా గురువారం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు.
మంత్రాలయం, మే 1(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, కుమారుడు శివమొగ్గ ఎంపీ రాఘవేంద్ర కుటుంబ సమేతంగా గురువారం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. బుధవారం రాత్రి మంత్రాలయంకు వచ్చి పద్మనాభతీర్థ గెస్ట్ హౌస్‌లో బసచేశారు. మహా ముఖద్వారం వద్ద వీరికి మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు సురేష్ కోణాపూర్, వెంటేష్ జోషి, శ్రీపతి ఆచార్, ఐపీ నరసింహామూర్తి, సీఐ రామాంజులు, ఎస్‌ఐ శివాంజల్ ఘనంగా స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. తన మనవడి వివాహానికి రావాలని పీఠాధిపతిని ఆహ్వానించారు. సూపరింటెండెంట్ అనంతపురాణిక్, విజయేంద్రాచార్, వ్యాసరాజాచార్, రాఘవేంద్రపురాణిక్, నరసింహదేశాయ్, ద్వారపాలక అనంతస్వామి, తంబిస్వామి, వాజేంద్రాచార్, రాఘవేంద్రాచార్, పవన్‌ఆచార్, రంగస్వామి, వరధేంద్రాచార్ తదితరులు పాల్గొన్నారు.