అడవి సంరక్షణ అందరి బాధ్యత: రేంజర్
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:41 AM
అడవి సంరక్షణ అందరి బాధ్యత అని రేంజర్ ముర్తుజావలి అన్నారు.
రుద్రవరం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): అడవి సంరక్షణ అందరి బాధ్యత అని రేంజర్ ముర్తుజావలి అన్నారు. బుధవారం రేంజ్ కార్యాలయంలో ఫారెస్టు సెక్షన ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులను కాపా డుదాం.. వాటిని వేటాడితే 1972 వన్యప్రాణి చట్టం కింద కేసులు నమో దు చేస్తామన్నారు. రుద్రవరం రేంజ్‌లో ఐదు సెక్షనలు, 14 బీట్‌లు ఉన్నాయన్నారు. 42113.98 హెక్టార్లలో రేంజ్ విస్తరించి ఉందన్నారు. అడవి నుంచి వెదురు, కలప అక్రమ రవాణాకు పాల్పడకుండా నివారి ద్దామన్నారు. వేటగాళ్లపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిం చాలన్నారు. అటవీ ప్రాముఖ్యతను కళాశా లలు, పాఠశాలల్లో వివరించా లన్నారు. కార్యక్రమంలో సెక్షన ఆఫీసర్లు మక్తర్‌బాషా, శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌ఖాన, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.