Share News

పూర్వ వైభవం కోసం..

ABN , Publish Date - Dec 25 , 2025 | 11:52 PM

వందల సంవత్సరాలుగా గ్రామానికి నీరందించిన బావి శిథిలావస్థకు చేరుకోవడంతో యువత చలించిపోయారు. చెత్తా, చెదారంతో నిండిపోయిన బావికి పూర్వవైభవం తీసుకురావాలని యువకులు భావించారు.

పూర్వ వైభవం కోసం..
బావి పూడికతీతకు శ్రమదానంలో పాల్గొన్న సీఐ రమేష్‌బాబు

పురాతన బావికి మరమ్మతులు

కొలిమిగుండ్ల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వందల సంవత్సరాలుగా గ్రామానికి నీరందించిన బావి శిథిలావస్థకు చేరుకోవడంతో యువత చలించిపోయారు. చెత్తా, చెదారంతో నిండిపోయిన బావికి పూర్వవైభవం తీసుకురావాలని యువకులు భావించారు. అనుకున్నదే తడవుగా బావికి మరమ్మతులు చేయడానికి పూనుకున్నారు. ఆ యువకుల సంకల్పానికి కొలిమిగుండ్ల సీఐ మద్దినేని రమేష్‌ బాబు కూడా తోడయ్యారు. స్వయంగా సీఐ పారిశుధ్య పనులు చేపట్టడంతో ఊరంతా కలసివచ్చి బావికి మరమ్మతులు చేయసాగారు. కొలిమిగుండ్ల మండలంలోని నందిపాడు గ్రామంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఓ బావి చెత్తా, చెదారంతో నిండిపోయింది. అక్కడ ఉన్న బావిని గ్రామస్థులు మర్చిపోయే పరిస్థితికి రావడంతో గ్రామానికి చెందిన యువకులు ఏకమయ్యారు. పురాతన కట్టడాల సంరక్షణ దళం, ఆర్‌ఎ్‌సఎస్‌ సహాయంతో గ్రామస్థులంతా కలసి పురాతన బావిని సంరక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. వీరికి సీఐ మద్దినేని రమే్‌షబాబు కూడా సహకరించడంతో పాటు స్వయంగా పనులు చేపట్టారు. చరిత్ర సంసృతి, సంప్రదాయాలను ప్రతిభింభించే పురాతన కట్టడాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి సంరక్షించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఎస్‌ చంద్రశేఖరరెడ్డి, రాముడునాయక్‌, లోక్‌నాథరెడ్డి, రామాంజనేయరెడ్డి, మహే్‌షశర్మ, శ్రీరాములు పలువురు సభ్యులు పాల్గొన్నారు

Updated Date - Dec 25 , 2025 | 11:52 PM