Share News

ప్రతిభావంతుల కోసమే..

ABN , Publish Date - Aug 10 , 2025 | 12:40 AM

ఔత్సాహిక క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం సువర్ణ అవకాశం ఇచ్చింది. వీరిలో ప్రతిభను వెలికితీసేందుకు సన్నాహాలు చేస్తోంది. అమరావతిలో 2500ఎకరాల్లో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలోని క్రీడాకారులకు అత్యాధునిక వసతులతో క్రీడా మైదానాలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 29న ధ్యానచంద్‌ జయంతి సందర్భంగా క్రీడా పండుగను ఘనంగా నిర్వహించేందుకు శాప్‌ చైర్మన్‌ కృషి చేస్తున్నారు. శాప్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు ఉత్సాహం చూపుతున్నారు. తిరుపతిలో జరిగే జోనల్‌స్థాయి పోటీలు ఈ 11నుంచి 14వరకు, విజయవాడలో జరిగే రాస్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 16నుంచి 20వరకు నిర్వహించనున్నారు.

ప్రతిభావంతుల కోసమే..

ఔత్సాహిక క్రీడాకారులకు సువర్ణ అవకాశం

2029జాతీయ క్రీడల నిర్వహణే లక్ష్యంగా

ధ్యాన్‌చంద్‌ జయంతిని క్రీడా పండుగగా జరిపించేందుకు కృషి

ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు జోనల్‌స్థాయి పోటీలు

16నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీలు

నంద్యాల హాస్పిటల్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): 22ఏళ్ల లోపు క్రీడాకారులు తమ ప్రతిభను చూపేందుకు జిల్లా, జోన్‌, రాష్ట్రస్థాయి పోటీలను రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. 2029.లో అమరావతిలో జాతీయ క్రీడల నిర్వహణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకే రాష్ట్రవ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అమరావతిలో దాదాపు 2500ఎకరాల్లో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలోని క్రీడాకారులకు అత్యాధునిక వసతులతో క్రీడా మైదానాలు అందుబాటులోకి రానున్నాయి. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా జరిగే జాతీయ క్రీడాదినోత్సవాన్ని ఈ ఏడాది ఆగస్టు 29న ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. కొన్నేళ్లుగా జాతీయక్రీడాదినోత్సవం నామమాత్ర ంగా జరుపు కుంటుండగా ఈఏడాది ప్రత్యేకంగా శాప్‌ చైర్మన్‌ రవి నాయు డు ప్రోత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పండుగ జరపనున్నారు. మూడు దశల్లో నిర్వహించే ఈ క్రీడాపోటీలకు శాప్‌ ఖర్చులు భరించనుంది.

క్రీడా విభాగాలివి..

ఆర్చరీ, బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌, డబుల్స్‌, బాక్సింగ్‌, బాస్కెట్‌బాల్‌, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్‌లిఫ్టింగ్‌, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌లో 100మీటర్లు, 400మీటర్లు, 4 ఇంటు 400మీటర్లు రిలే, 800మీటర్లు, లాంగ్‌జంప్‌, షాట్‌ఫుట్‌లలో పోటీలు నిర్వహిస్తారు.

పది క్రీడాంశాల్లో స్త్రీ, పురుషులకు..

పది క్రీ డాంశాల్లో స్ర్తీ, పురుషులకు పోటీలు నిర్వహిస్తారు. ముందుగా జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించి అక్కడ గెలుపొందినవారిని తిరుపతిలో జరిగే జోన్‌స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. జోనల్‌ విజేతలకు రాష్ట్ర స్థాయి పోటీలు విజయవాడ ఐజీఎంసీ స్టేడి యంలో పోటీలు నిర్వహిస్తారు. శాప్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకా రులు ఉత్సాహం చూపుతున్నారు. ఇటీవల నం ద్యాల జిల్లా కేంద్రంలోని పద్మావతినగర్‌ డీఎస్‌ఏ మైదానం, ఎస్పీజీ పాఠశాల మైదానం, ఆర్జీఎం క్రీడామైదానాల్లో జరిగిన పోటీల్లో అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేశారు. తిరుపతిలో జరిగే జోనల్‌ స్థాయి పోటీలు ఈనెల 11నుంచి 14వరకు, విజయ వాడలో జరిగే రాస్ట్ర స్థాయి పోటీలు ఈనెల 16నుంచి 20వరకు నిర్వహించనున్నారు.

శాప్‌ ఆధ్వర్యంలో నిర్వహించే..

క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకే పోటీలు నిర్వహి స్తున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకా రులకు శాప్‌ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా అకాడమీల్లో అవకాశం కల్పిస్తారు. జిల్లాస్థాయి పోటీల్లో మంచిస్పందన లభించింది. క్రీడల అభి వృద్ధికి ఇలాంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయి. జిల్లాలో క్రీడాసంఘాల ప్రతి నిధులు, వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో జిల్లాస్థాయి పోటీలు విజయవంతం చేశాం. జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్లు, క్రీడాకారులు తిరుపతిలో జరిగే జోనల్‌ స్థాయి పోటీల్లో పాల్గొం టారు. - ఎంఎన్‌వీ రాజు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి, నంద్యాల

Updated Date - Aug 10 , 2025 | 12:40 AM