Share News

నగరం.. నరకం

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:33 AM

నగరంలోని ప్రదాన రహదారు పుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికావడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధాన కూడళ్లు కలెక్టరేట్‌, సి.క్యాంపు బస్‌స్టాప్‌ల వద్ద పుట్‌పాత్‌లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకోవంతో ప్రయాణికులు రోడ్డుకు అడ్డంగా నిలబడుతున్నారు.

నగరం.. నరకం
సి.క్యాంపు సెంటర్‌లో నడిరోడ్డుపై వేచి ఉన్న ప్రయాణికులు

ఫుట్‌పాత్‌ ఆక్రమణ, రోడ్డుపైనే ప్రయాణికులు

రోడ్డుకు అడ్డంగా ఆర్టీసీ బస్సులు, ఆటోల నిలిపివేత..

పౌరుల అవస్థలు

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రదాన రహదారు పుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికావడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధాన కూడళ్లు కలెక్టరేట్‌, సి.క్యాంపు బస్‌స్టాప్‌ల వద్ద పుట్‌పాత్‌లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకోవంతో ప్రయాణికులు రోడ్డుకు అడ్డంగా నిలబడుతున్నారు. కొన్ని సందర్బాల్లో ప్రయాణికులపై వాహనాలు దూసుకెళ్లిన సంఘటనలు ఉన్నాయ.ఇ సి.క్యాంపు సెంటర్‌ బస్‌స్టాప్‌లో ప్రైవేటు వాహనాలు అడ్డంగా నిలుపుతున్నారు. ఆర్టీసీ బస్సులు నడిరోడ్డుపై నిలపడంతో తరచుగా ట్రాపిక్‌ జామ్‌ అవుతోంది.

పత్తాలేని ట్రాఫిక్‌ పోలీసులు.

నిత్యం రద్దీగా ఉండే కూడల్లలో ఉండాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు కనిపంచడం లేదని నగర పౌరులు విమర్శిస్తున్నారు. పోలీసులకు ప్రతి నెలా ముడుపులు అందుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తుున్నారు. గతంలో ఆటోలకు ప్రత్యేకమైన దారి ఉండేది, మరిఏమైందో అది కనుమరుగైంది. ఇప్పటికైనా పోలీసులు ఉన్నతాధికారులు స్పందింది ట్రాఫిక్‌ నియత్రణకు చర్యలు తీసుకోవాలని పౌరులు కోరుతున్నారు.

Updated Date - Dec 11 , 2025 | 12:33 AM