Share News

ఆలూరులో ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తనిఖీలు

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:00 AM

మండలంలో రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిత్త విజయ ప్రతాప్‌ రెడ్డి మంగళవారం పర్యటించారు. మొలగవల్లి గ్రామంలో రేషన్‌ సరఫరా చేసే వాహనాన్ని ఆయన తనిఖీ చేశారు.

ఆలూరులో ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తనిఖీలు
హాస్టల్‌లో భోజనాన్ని పరిశీలిస్తున్న విజయ ప్రతాప్‌ రెడ్డి

సంక్షేమ హాస్టళ్లు, రేషన్‌ దుకాణాల పరిశీలన

నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు

ఆలూరు, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): మండలంలో రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిత్త విజయ ప్రతాప్‌ రెడ్డి మంగళవారం పర్యటించారు. మొలగవల్లి గ్రామంలో రేషన్‌ సరఫరా చేసే వాహనాన్ని ఆయన తనిఖీ చేశారు. సక్రమంగా నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారా? లేదా? అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలూరు కేజీబీవీ స్కూల్‌, గిరిజన ఆశ్రమ పాఠశాల, ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌తో పాటు రేషన్‌ షాపును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో సక్రమంగా భోజనం సరఫరా చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్టల్స్‌, రేషన్‌ షాప్స్‌, అంగన్‌వాడీ కేంద్రాల్లో సక్రమంగా సరుకులు సరఫరా చేయాలన్నారు. నాణ్యమైన కూరగాయలు, గుడ్లు, సరుకులు సరఫరా చేయకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి వరకు తనిఖీలు చేశారు. ఆయన వెంట సీఐ రవి శంకర్‌ రెడ్డి, తహసీల్దార్‌ గోవింద్‌ సింగ్‌, డీటీ దీప, ఆర్‌ఐ బసవన్న గౌడ్‌, ఏఎస్‌ డబ్ల్యూఓ బాబు, ప్రిన్సిపాల్స్‌ సుహాసిని, జమ్మన్న, వార్డెన్‌ మహ్మద్‌ అలీ, షెహనూర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:00 AM