Share News

లక్ష్యంపైనే దృష్టి సారించాలి

ABN , Publish Date - Sep 12 , 2025 | 01:04 AM

విద్యార్థులు లక్ష్యంపైనే దృష్టి సారించాలని హైదరాబాద్‌ ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌ బాలలత పేర్కొన్నారు.

లక్ష్యంపైనే దృష్టి సారించాలి
సదస్సులో మాట్లాడుతున్న బాలలత

ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌ బాలలత

పాణ్యం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు లక్ష్యంపైనే దృష్టి సారించాలని హైదరాబాద్‌ ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌ బాలలత పేర్కొన్నారు. గురువారం శాంతిరాం ఇంజనీరింగ్‌ కళాశాలలో బేసిక్‌ సైన్సెస్‌ విభాగం ఆధ్వర్యంలో ఐఎ్‌సటీఈ స్టూడెంట్స్‌ చాప్టర్‌ ఏపీ 133 సహకారంతో ‘హౌటు చూజ్‌ ద రైట్‌ పాత’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాలలత మాట్లాడుతూ చిన్న కలలతో ఆగిపోకండి, పెద్ద కలలను కనాలని సూచించారు. టెస్లా వ్యవస్థాపకుడు మస్క్‌ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒకే పనిపై ఇరవై నిమిషాలు దృష్టిని కేంద్రీకరించి చిన్న విరామం తర్వాత మళ్లీ అదే ఉత్సాహంతో కొనసాగితే విజయం తప్పదని స్పష్టం చేశారు. స్వీయ ప్రేరణ నిలకడగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం, హెచఓడి శేషయ్య విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 01:04 AM