హాస్టల్‌లో పారిశుధ్యంపై దృష్టి పెట్టండి
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:29 PM
హాస్టల్‌లో పారిశుధ్యం, మౌలిక వసతులపై అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపలె, డిసెంబరు 27 (ఆంఽఽధ్రజ్యోతి): హాస్టల్‌లో పారిశుధ్యం, మౌలిక వసతులపై అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని బీసీ బాలుర హాస్టల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీచర్లు పాఠ్యాంశాలు, బోధిస్తున్నతీరు సిలబస్ ఎంతవరకు పూర్తయింది వంటి అంశాలను విద్యార్థులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. హాస్టల్‌లో వంటగదిని పరిశీలించి ఆహారాన్ని స్వయంగా రుచి చూశారు. అనంతరం ఏపీ మోడల్‌స్కూల్‌ను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠ్యాంశాల బోధన, మౌలిక వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకు న్నారు. బాలికల హాస్టల్ విద్యార్థుల తాగునీటి సమస్యను గురించి మత్రి దృష్టికి తేగా తక్షణమే రూ.3లక్షలతో మినల్‌వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేస్తామని ఆయన హామీఇచ్చారు. బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి నూతనంగా నిర్మిస్తున్న భవనాలను మంత్రి పరిశీలించారు. ఆయా నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను మంత్రి ఆదేశించారు.