అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టండి: కలెక్టర్
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:37 PM
ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులకు సూచించారు.
నంద్యాల నూనెపల్లి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులకు సూచించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రీఓపెన్ అయిన 592 దరఖాస్తులను ఒక వారం రోజుల్లో పూర్తిస్థాయిలో క్లియర్ చేయాలని ఆదేశించారు. అలాగే ఎస్‌ఎల్‌ఏలో ఉన్న 1,797 దరఖాస్తులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పెండింగ్ అర్జీల ఆడిట్‌ను నిరంతర ప్రక్రియగా తీసుకోవాలని, ప్రతి దరఖాస్తు ప్రగతి దశను అధికారులు స్వయంగా పర్యవేక్షించి ఆలస్యానికి తావు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.