Share News

గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి : డీఎంహెచ్‌వో

ABN , Publish Date - Sep 30 , 2025 | 12:52 AM

ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని డీఎంహెచ్‌వో డా.పి.శాంతికళ సూచించారు.

గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి : డీఎంహెచ్‌వో
ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో శాంతికళ

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని డీఎంహెచ్‌వో డా.పి.శాంతికళ సూచించారు. వరల్డ్‌ హార్ట్‌డే సందర్భంగా సోమవారం కిమ్స్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ నుంచి కిసాన్‌ ఘాట్‌ వరకు ర్యాలీ నిర్వహించి, ఉచిత కార్డియాక్‌ క్యాంప్‌ను ప్రారంభించారు. పోన్లు, ల్యాప్‌ట్యా్‌పలు, టీవీల ముందు కూర్చుని కాలక్షేపం చేయడంతో వ్యాదులు వస్తున్నాయన్నారు. వ్యాయామం దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. కిమ్స్‌ సీఈవో డా.సునీల్‌ సేపూరి మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో రూ.4వేల విలువైన గుండెపరీక్షలను రూ.650లకే చేస్తున్నామన్నారు. డా.తోటనాగేంద్ర ప్రసాద్‌, డా.సందీప్‌ కుమార్‌, డా.అరుణ, డా.ఫారూక్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 12:52 AM