Share News

డ్రంకెన్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌పై దృష్టి పెట్టండి

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:59 PM

పోలీసు సిబ్బంది డ్రంకెన్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశించారు. మంగళవారం ఉల్లిందకొండ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌పై దృష్టి పెట్టండి
స్టేషన్‌లో రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

ఉలిందకొండ పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ

కర్నూలు క్రైం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పోలీసు సిబ్బంది డ్రంకెన్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశించారు. మంగళవారం ఉల్లిందకొండ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులు, పెండింగ్‌ కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్టు, దర్యాప్తు పురోగతిపై కే ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సీఐలు, ఎస్‌ఐలతో మాట్లాడుతూ ప్రాపర్టీ కేసులను ఛేదించి రికవరీ చేయాలని, బాధితులు స్టేషన్‌ను ఆశ్రయించినప్పుడు వారి పరిష్కారం చూపాలని ఆదేశించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సైబర్‌ నేరాలు, మహిళా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బాబు ప్రసాద్‌, రూరల్‌ సీఐ చంద్రబాబు నాయుడు, డీసీఆర్‌బీ సీఐ గుణశేఖర్‌, ఎస్‌ఐ ధనుంజయ పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 11:59 PM