Share News

శ్రీశైలానికి స్వల్పంగా తగ్గిన వరద

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:55 PM

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. అధికారులు రెండు గేట్లను మూసివేశారు.

 శ్రీశైలానికి స్వల్పంగా తగ్గిన వరద
8 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

రెండు గేట్లు మూసివేత

శ్రీశైలం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. అధికారులు రెండు గేట్లను మూసివేశారు. 8 గేట్ల ద్వారా సాగర్‌కు 2,21,664 కూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ జూరాల గేట్లు, విద్యుదుత్పత్తి, సుంకేసులు, హంద్రి మొత్తం 2,27,822 క్యూసెక్కులు వచ్చి చేరింది. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి డ్యాం నీటిమట్టం 884 అడుగులు కాగా నీటినిల్వ సామర్థ్యం 210 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ విధ్యుత్‌ కేంద్రాలు ఉత్పత్తి అనంతరం 65,976 క్యూసెక్కులు విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో రెండు విద్యుత్‌ కేంద్రాల్లో 32.291 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి చేసి జెన్‌కో అధికారులు గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.

Updated Date - Oct 04 , 2025 | 11:55 PM