శ్రీశైలానికి తగ్గిన వరద
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:27 AM
శ్రీశైల జలాశయానికి వరద తగ్గింది. ఆదివారం రాత్రి 7గంటల సమయానికి ఐదు గేట్ల గుండా 1,37,390 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేశారు.
ఐదు గేట్లతో నీటి విడుదల
నీటినిల్వ సామర్థ్యం 208 టీఎంసీలు
శ్రీశైలం, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): శ్రీశైల జలాశయానికి వరద తగ్గింది. ఆదివారం రాత్రి 7గంటల సమయానికి ఐదు గేట్ల గుండా 1,37,390 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేశారు. డ్యాం నీటిమట్టం 883 అడుగులు ఉండగా నీటినిల్వ సామర్థ్యం 208 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ జూరాల స్పిల్‌వే, సుంకేసుల నుంచి 1,28,949 క్యూసెక్కులు శ్రీశైలం రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరాయి. శ్రీశైలం రెండు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి అనంతరం జెన్‌కో అధికారులు 65,930 క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలం డ్యామ్‌కు వరద ప్రవాహం తగ్గేకొద్ది గేట్ల సంఖ్యను ఇంజనీర్లు తగ్గిస్తున్నారు. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు విద్యుత్ కేంద్రాల్లో 32.008 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.