వరికి వరద పోటు
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:32 PM
అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేని వానలు కురిస్తున్నాయి. చేతికొచ్చిన వరి పంట వందల ఎకరాల్లో నీట మునిగి రైతులకు అపార నష్టం వాటిల్లింది.
ఎడతెరిపిలేని వానలు
ఈదురుగాలులతో నేలవాలిన పైరు
అన్నదాతకు అపార నష్టం
కోసిగి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేని వానలు కురిస్తున్నాయి. చేతికొచ్చిన వరి పంట వందల ఎకరాల్లో నీట మునిగి రైతులకు అపార నష్టం వాటిల్లింది. మండల పరిధిలోని తుమ్మిగనూరు, సాతనూరు, కందుక ూరు, కడిదొడ్డి గ్రామాల్లో చేతికొచ్చిన వరి కంకులు ఈదురు గాలులకు నేలవాలాయి. కోతకు సిద్ధమైన వరి పంట చేతికందే సమయంలో అల్పపీడనంతో రైతులకు భారీ నష్టం చేకూర్చింది. తుంగభద్ర నదితీర ప్రాంతాల్లో వరి పొలాలు నీట మునగడంతో రైతులకు రూ.లక్షల్లో కలిగింది. సంబంధిత అధికారులు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పత్తికాయలు నల్లబారి కిందకు పడిపోతుండటంతో పగిలిన పత్తి సైతం వర్షానికి తడిసిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.