శ్రీశైలం డ్యాంకు తగ్గిన వరద
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:09 PM
శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. 1,77,823 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వచ్చిచేరుతోంది.
శ్రీశైలం,సెప్టెంబరు 2 (ఆంద్రజ్యోతి): శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. 1,77,823 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వచ్చిచేరుతోంది. జలాశయానికి వరద నీటి చేరికలు తగ్గడంతో రిజర్వాయర్ ఏడు గేట్లను మూసివేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి 3 గేట్ల నుంచి 79,818 క్యూసెక్కులు సాగర్‌కు పంపిస్తున్నారు. శ్రీశైలం రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అనంతరం జెన్‌కో అధికారులు 66,275 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం నీటిమట్టం సాయంత్రం 6గంటల సమయానికి 881 అడుగులుగా ఉండగా నీటినిల్వ సామర్ధ్యం 197 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం డ్యాం ఇంజనీర్లు గరిష్టస్థాయి నీటి నిల్వలు ఉంచుతూ వరద నీటిని సాగనంపుతున్నారు.