శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:15 PM
శ్రీశై లం జలాశయానికి వరద తగ్గముఖం పట్టింది.
శ్రీశైలం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశై లం జలాశయానికి వరద తగ్గముఖం పట్టింది. కాగా జలాశయం 10 గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్న జలవనరుల శాఖ అధికారులు శుక్రవారం రెండు గేట్లను మూసివేశారు. 8 క్రస్ట్ గేట్ల స్పిల్‌వే గుండా 2,15,424 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు సాగనంపుతున్నారు. రిజర్వాయర్‌కు ఎగువ జూరాల స్పిల్‌వే, విద్యుదుత్పత్తి అనంతరం, సుంకేసుల, హంద్రీ 2,87,051 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. శ్రీశైలం రెండు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అనంతరం 65,820 క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైల డ్యాం నీటిమట్టం శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి 882 అడుగులుగా ఉండగా, నీటి నిల్వసామర్థ్యం 202టీఎంసీలుగా నమోదు అయింది.