Share News

శ్రీశైలం జలాశయానికి వరద

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:02 AM

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది.

శ్రీశైలం జలాశయానికి వరద

881.80అడుగులకు చేరిన నీటిమట్టం

నీటి లభ్యత 197.91 టీఎంసీలు

68,338 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల

నంద్యాల, జూలై16 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. జూరాల నుంచి 36,613 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 16,688 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్‌ ఉత్పాదన కింద 68,338 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో బుధవారం సాయంత్రానికి నీటి మట్టం 885.00 అడుగులు ఉండగా.. 881.80 అడగులకు చేరింది. నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా నీటి లభ్యత 197.91 టీఎంసీలుగా నమోదైంది.

Updated Date - Jul 17 , 2025 | 12:02 AM