Share News

విమాన వేళ ..!

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:28 AM

జిల్లా వాసుల మరో కల నెరవేరింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కర్నూలు-విజయవాడ విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

 విమాన వేళ ..!

నేటి నుంచి కర్నూలు-విజయవాడ ఫ్లైట్‌ సర్వీసులు

ఓర్వకల్లు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా వాసుల మరో కల నెరవేరింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కర్నూలు-విజయవాడ విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇండిగో విమానయాన సంస్థ ఈ సర్వీసులను నడుపనుంది. బుధవారం విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ఇండిగో మొదటి సర్వీసు మధ్యాహ్నం 3:45 గంటలకు బయలుదేరి ఓర్వకల్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయానికి సాయంత్రం 4:50 గంటలకు చేరుతుంది. నంద్యాల, కర్నూలు పార్లమెంట్‌ సభ్యులు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, మంత్రులు టీజీ భరత్‌, బీసీ జనార్దన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా ముఖ్య అతిథులుగా సాయంత్రం 4 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని 4:14 గంటలకు మొదటి ప్రయాణికుడికి బోర్డింగ్‌ పాస్‌ అందజేస్తారు. ప్రముఖుల ప్రసంగం అనంతరం 5:10 గంటలకు ప్రయాణికులతో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి విమానం బయలుదేరి 6:15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుతుంది. ఈ సర్వీసులు వారంలో మూడు రోజులు (సోమ, బుధ, శుక్ర) అందుబాటులో ఉండనున్నాయి. ఈ కొత్త సర్వీసుల ద్వారా కర్నూలు-విజయవాడ ప్రయాణం మరింత సులభతరం అవుతుంది.

Updated Date - Jul 02 , 2025 | 12:28 AM