ఆలూరులో ఫ్లెక్సీల రగడ
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:06 AM
ప్రశాంతంగా ఉన్న ఆలూరులో అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరా జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు చిరిగిపోవడం మంగళవారం వివాదస్పదంగా మారింది
చిరిగిన గుమ్మనూరు జయరాం జన్మదిన ఫ్లెక్సీలు
వైకుంఠం అనుచరులపై గుమ్మనూరు మండిపాటు
పెద్దఎత్తున గుమికూడిన ఇన్‌చార్జి జ్యోతి అనుచరులు
పోలీస్‌స్టేషన్‌లో జయరాంపై ఫిర్యాదు
ఆలూరు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రశాంతంగా ఉన్న ఆలూరులో అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరా జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు చిరిగిపోవడం మంగళవారం వివాదస్పదంగా మారింది. ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అనుచరులు ఫ్లెక్సీలు చింపేశారని జయరాం ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యారు. దీంతో వైకుంఠం జ్యోతి అనుచరులకు, జయరాంకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా పెద్దఎత్తున టీడీపీ నేత వైకుంఠం శివప్రసాద్ అక్కడికి చేరుకోకముందే పోలీసులు వివాదాన్ని సద్దుమణిగించి అక్కడి నుంచి జయరాంను పంపించి వేశారు. దీంతో ఏం జరుగుతుందోనని టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉద్దేశపూర్వకంగానే ఫ్లెక్సీలు చింపివేశారని జయరాం ఆరోపించారు. ఇదే విషయంపై ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ ఫ్లెక్సీలు చింపి వేసే అంత దిగజారుడు రాజకీయాలు తమవి కావన్నారు. అనవసరంగా తమ అనుచరులపై ఆరోపణలు చేయడం ఎమ్మెల్యే జయరాంకు తగదన్నారు. తాను కూడా జరిగిన సంఘటనపై పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గుమ్మనూరు జయరాం, శ్రీనివాసులపై పోలీసులకు వైకుంఠం జ్యోతి అనుచరులు అబిద్, శివ, నాగరాజులు ఆలూరు ఇన్‌చార్జి ఎస్‌ఐ దిలీ్‌పకుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.