ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:45 PM
నగర ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధ్యామివ్వాలని కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు.
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): నగర ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధ్యామివ్వాలని కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర పాలక కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్‌లో 36 ఫిర్యాదులు వచ్చాయి. సంబంధిత విభాగాధికారులు నమోదు చేసుకుని, పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీసీ సతీష్‌కుమార్‌రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ఇన్‌చార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ మనోహర్‌రెడ్డి, ఆర్‌వో జునైద్, డీసీపీ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులలో కొన్ని..
టెలికాం నగర్‌లో రహదారులకు మరమ్మతులు చేయాలని శాంతికుమారి కోరారు వీకర్ సెక్షన్ కాలనీలో పిచ్చిమొక్కలను తొలగించాలని, వీధిదీపాల సమస్యలను పరిష్కరించాలని ఉప్పర రవి విన్నవించారు. రాజ భోజనం హోటల్ సమీపంలో సీసీ రోడ్డు నిర్మించాలని హేమలత సుబ్రహ్మణ్యం కోరారు. జయరాం నగర్‌లో సీసీ రోడ్లు వేయాలని లీలా మోహన్ కోరారు. ప్రకాష్ నగర్‌లో కుక్కల బెడద తగ్గించాలని స్థానికురాలు అర్షియా భాను ఫిర్యాదు చేశారు.