అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Nov 04 , 2025 | 10:54 PM
జ్వాలాతోరణోత్సవం బుధవారం సాయంత్రం నిర్వహిస్తున్న నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రామాంజినాయక్ అన్నారు.
డీఎస్పీ రామాంజినాయక్
శ్రీశైలం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జ్వాలాతోరణోత్సవం బుధవారం సాయంత్రం నిర్వహిస్తున్న నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రామాంజినాయక్ అన్నారు. మంగళవారం జ్వాలాతోరణోత్సవానికి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధానంగా వాహనాల పార్కింగ్, దేవాలయ పరిసరాలు, ప్రసాదం విక్రయ కేంద్రాలు, క్యూకాంప్లెక్స్‌ల వద్ద చర్యలు తీసుకోవాలని సూచించారు. గంగాధర మండపం వద్ద జరిగే కార్యక్రమంలో తోపులాట జరగకుండా దీపాలు వెలిగించే వేదికకు చుట్టూ రెండంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయించడంతోపాటు అగ్నిమాపక దళాన్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సీఐ ప్రసాదరావు, అధికారులు ఉన్నారు.