ముగిసిన ఆభరణాల లెక్కింపు
ABN , Publish Date - Oct 17 , 2025 | 01:14 AM
: మండలంలోని నందవరం చౌడేశ్వరీమాత దేవస్థానంలో మూడు రోజులుగా జువెల్లరీ వెరిఫికేషన్ అధికారి పాండుంరగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నఅమ్మవారి బంగారం, వెండి ఆభరణాల లెక్కింపు గురువారంతో ముగిసినట్లు నందవరం ఆలయ అసిస్టెంట్ కమీషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
బనగానపల్లె, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నందవరం చౌడేశ్వరీమాత దేవస్థానంలో మూడు రోజులుగా జువెల్లరీ వెరిఫికేషన్ అధికారి పాండుంరగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నఅమ్మవారి బంగారం, వెండి ఆభరణాల లెక్కింపు గురువారంతో ముగిసినట్లు నందవరం ఆలయ అసిస్టెంట్ కమీషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జేవీవో పాండురంగారెడ్డి దేవస్థానంలో బంగారు, వెండి ఆభరణాలకు సంబంధించి ఆభరణాలు అప్రైసర్ చేసినట్లు తెలిపారు. గత ఈవోలు రామానుజన్, కామేశ్వరమ్మ బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు అప్పగించినట్లు తెలిపారు. దేవస్థానంలో 7కిలోల 497 గ్రాముల 550 మిల్లీ గ్రాముల బంగారు ఉన్నట్లు తెలిందన్నారు. అలాగే 244 కిలోల 717 వెండి ఉన్నట్లు తెలిపారు. ఈ ఆభరణాలను తిరిగి బ్యాంకుల్లో భద్రపరచనున్నట్లు ఆయన తెలిపారు.