ఆఖరికి అవస్థలే..!
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:08 AM
మనిషి రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతుందన్నా.. కొన్ని విషయాల్లో నేటికీ వెనుకబడే ఉన్నా డు.
శ్మశానానికి వెళ్లాలంటే నది దాటాల్సిందే
ఉధృతంగా ప్రవహిస్తున్న వకులా నది
ఇబ్బందులు పడ్డ మృతుడి బంధువులు
ఆళ్లగడ్డ, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): మనిషి రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతుందన్నా.. కొన్ని విషయాల్లో నేటికీ వెనుకబడే ఉన్నా డు. ఆఖరి(అంత్యక్రియలు) నిర్వహించాల్సి అవస్థలు తప్పడం లేదు. ఉధృతంగా ప్రవహిస్తున్న నది దాటి వెళ్లాల్సిన పరిస్థితి మండలంలోని జి.జంబులదిన్నె గ్రామంలో నెలకొంది. జంబులదిన్నె గ్రామానికి చెందిన వడ్ల మీరావలి కుమారుడు షాజహాన్(18) శనివారం స్నేహితులతో కలిసి ఈతకెళ్లి ప్రమాదవశాత్తు నదిలో మునిగి చనిపోయాడు. ఆది వారం అతడి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు సిద్ధమ య్యారు. అయితే గ్రామంలో శ్మశాన సౌకర్యం లేదు. దీంతో యువకుడి మృతదేహాన్ని శవపేటిక(డోలీ)లో పెట్టుకొని ఉధృతంగా ప్రవహించే వకులా నది దాటాల్సి వచ్చింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న పరి స్థితిలో నదినిదాటి అవతల ఒడ్డుకు చేరాల్సి వచ్చింది. కుటుంబసభ్యులు డోలీని భుజాలపై వేసుకొని నీటి ప్రవాహాన్ని లెక్క చేయకుండా నది దాటి అవలిఒడ్డుకు చేరుకొని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో పాలు పంచుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు సైతం ఉధృతంగా ప్రవహిస్తున్న వకులా నదిని అతి కష్టం మీద దాటి అంత్రక్రియల్లో పాలు పంచుకొన్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం జంబులదిన్నె గ్రామానికి శ్మశాన వాటికను ఏర్పాటు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.