ఎమ్మెల్యే, క్రిష్ణమ్మపై కేసు నమోదు చేయాలి
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:35 AM
ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఆ
మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు
కర్నూలు అర్బన్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఆదోని మండలం ఢణాపురంలో జరిగిన కూటమి ప్రభుత్వ సంవత్సర పాలన సంబరాలు జరుపుకుంటూ గుడి దగ్గర జరిగిన సభలో దళితుడైన సర్పంచ్ చంద్రశేఖర్‌ను అవమా నించడం బాఽధాకరమన్నారు. ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, రాజ్యాంగ హక్కులను గౌరవించి సాటి మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోవా లని కోరారు. ఎమ్మెల్యే, గుడిసె క్రిష్ణమ్మపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు బాబురావు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు ఎన్సీ బజారన్న, లాజరస్ పాల్గొన్నారు.
క్షమాపణలు చెప్పాలి : కేవీపీఎస్
కర్నూలు న్యూసిటీ: దళిత సర్పంచ్‌ని అవమానించిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మ క్షమాపణలు చెప్పాలని కేవీపీఎస్ నగర అధ్యక్షుడు ఆర్.రమణ డిమాండ్ చేశారు. గురువారం కేవీపీఎస్ పాతనగరం కమిటీ అధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా రమణ మాట్లాడుతూ సభా వేదికపైకి గ్రామప్రథమ పౌరుడైన దళిత సర్పంచ్ చంద్రశేఖర్‌ను పిలవకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటము దారుణమన్నారు. దుర్మార్గమైన హేయమైన ఘటనకు కారణమైన కూటమి టీడీపీ ఇంచార్జి గుడిసె కృష్ణమ్మ, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలాని డిమాండ్ చేశారు. నాయకులు గురుస్వామి, ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, ఎన్.జి.కృష్ణ పాల్గొన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకులు గుడిసె కృష్ణమ్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
దళిత సర్పంచును కులం పేరుతో అవమానించిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆవాజ్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు పి.ఇక్బాల్ హుస్సేన్, జిల్ల ప్రధాన కార్యదర్శి ఎస్.ఏ.సుభాన్ డిమాండ్ చేశారు.