Share News

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:10 AM

ఆర్టీసీ ఉద్యోగ, కార్మికుల పరిష్కారం కోసం నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తోందని ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డిఅన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం
మాట్లాడుతున్న ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి

కర్నూల రూరల్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగ, కార్మికుల పరిష్కారం కోసం నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తోందని ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డిఅన్నారు. కర్నూలు నగర శివారులోని కమ్మ సంఘం భవన్‌లో మంగళవారం ఆర్టీసీ ఎన్‌ఎంయూ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రమణారెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ పోరాట ఫలితంగానే కార్మికులకు సంబందించిన అనేక సమస్యలను సాధించామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష వైఖరి వల్ల సమస్యలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ చేసి పనిభారం తగ్గించాలని, పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశ అనంతరం ఆర్టీసీ ఎన్‌ఎంయూలో సుదీర్ఘ కాలంగా జిల్లా కార్యదర్శిగా పనిచేసి జిల్లాల్లో ఉద్యోగుల ఆదరాభిమానాలు పొంది పదవీ విరమణ పొందిన సి. మద్దిలేటిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జోనల్‌ కార్యదర్శి చెన్నారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పూర్ణచంద్రరావు, పీవీ శివారెడ్డి, హరిమోహన్‌, భాస్కర్‌నాయుడు, సంయుక్త కార్యదర్శి పీఎ్‌సఎన్‌ రావు, రాష్ట్ర కార్యదర్శులు భద్రావతి, షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:10 AM