ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదాం
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:48 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదా మని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పిలుపు నిచ్చారు. మండలంలోని దుదేకొండలో సీపీఐ శాఖ మహాసభలు ఆదివారం నిర్వహించారు

సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య
పత్తికొండ టౌన్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదా మని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పిలుపు నిచ్చారు. మండలంలోని దుదేకొండలో సీపీఐ శాఖ మహాసభలు ఆదివారం నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను గిడ్డయ్య ఆవిష్కరించారు. గత ఎన్నికల్లో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి, గద్దెనెక్కి ఏడాది పూర్తయినా హామీలను అమలు చేయలేదన్నారు. నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ ఉన్న ఉద్యోగులను తొలగించారన్నారు. ఖరీఫ్ ఇప్పటికే మొదలైందని నాణ్యమైన సబ్సిడీ విత్తనాలను రైతులకు ఇవ్వాలన్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేయాలన్నారు. ప్రజా సంక్షేమాన్ని మరచి పాలన సాగిస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టే పోరాటాల్లో ప్రజలు భాగ్యస్వామ్య కావాలన్నారు. సీపీఐ కార్యదర్శి రాజాసాహెబ్, దుదేకొండ సీపీఐ ఎంపీటీసీ ఈరన్న, క్రారుమంచి, కారన్న, కృష్ణయ్య, రంగన్న, గ్రామకార్యదర్శి రాముడు, అంజినేయ పాల్గొన్నారు.