Share News

బడుల్లో పండుగ

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:57 AM

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీటీఎం 3.0 పండువలా సాగింది. ఉర్దూ గురుకుల జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ సురేష్‌ అద్యక్షతన నర్విహించారు.

బడుల్లో పండుగ
త్రీడీ ప్రింటింగ్‌ గ్రీన్‌ ఎనర్జీ నమూనాను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే దస్తగిరి

కర్నూలు, కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాల్లో ఘనంగా మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీట్‌

కర్నూలు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీటీఎం 3.0 పండువలా సాగింది. ఉర్దూ గురుకుల జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ సురేష్‌ అద్యక్షతన నర్విహించారు. సముదా యన్‌ సౌఖ్యాలయ అబియాన్‌ జిల్లా కన్వీనర్‌ బి.జయకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేవీఆర్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఆర్‌ఐవో లాలెప్ప అధ్యక్షతన నిర్వహించారు. పూర్వ విద్యార్థి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సతీమణి జయసుధ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ కొట్టె చెన్నయ్య పాల్గొన్నారు. బి.క్యాంపు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ నాగస్వామి నాయక్‌, విశ్రాంత అధ్యాపకుడు బీవీ మాధవరావు, మోటివేషనల్‌ స్కిల్స్‌ ట్రైనర్‌ రత్న పాల్గొన్నారు.

కట్టమంచి స్మారక పాఠశాలలో..

ఎస్‌ఏపీ క్యాంపు కట్టమంచి రామలింగారెడ్డి స్మారక ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌, డైరెక్టర్‌ మనోజ్‌, అర్బన్‌ తహసీల్దార్‌ రవికుమార్‌, ఏపీఎప్పీ అసిస్టెంట్‌ కమాండెంట్‌ మహబూబ్‌ బాషా మాట్లడుతూ బాగా చదువుకుని వృద్దిలోకి రావాలని సూచించారు. పాఠశాల చైర్మన్‌ డి.కుమార్‌, ఉపాధ్యాయులు భాస్కర్‌ పాల్గొన్నారు.

పీటిఎంతో విప్లవాత్మక మార్పు: కుడా చైర్మన్‌ సోమిశెట్టి

కర్నూలు అర్బన్‌ : మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌తో విద్యార్థుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం నగరంలోని ప్రకాష్‌నగర్‌ టంగుటూరి ప్రకాశం పంతులు స్మారక నగర పాలక ఉన్నత పాఠశాలలో పీటీఎం3.0 కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. పాఠశాల అభివృద్ధికి రూ.10వేలు విరాళంగా అంజేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చి దిద్దాలన్న లక్ష్యంతోనే విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్‌ ఆరు నెలలకోసారి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేదరికం కారణంగా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో చదివే ప్రతి పిల్లవాడికి రూ.13 వేలు తల్లుల బ్యాంక్‌ ఖాతాలో టీడీపీ ప్రభుత్వం జమచేసిందన్నారు.

ఓర్వకల్లు: తల్లిదండ్రుల కలల సాకారమే విద్యార్థుల విజయానికి బలమని టీడీపీ నంద్యాల జిల్లా అద్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు. శుక్రవారం హుశేనాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో పీటీఎం సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కీలకమని పిల్లలకు క్రమశిక్షణతో కూడిన చదువు అలవాటు చేస్తే విజయం సాదిస్తారన్నారు. మోడల్‌ స్కూల్‌లో టీడీపీ నాయకుడు గోవిందరెడ్డి, బ్రాహ్మణపల్లెలో కన్వీనర్‌ నాగిరెడ్డి, పాలకొలను గ్రామంలో సర్పంచ్‌ చదువుల సుజాతమ్మ పాల్గొన్నారు.

మండలంలోని సోమయాజులపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం లిల్లిపుష్పరాణి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పశుసంవర్దక శాఖ జేడీ హేమంత్‌ కుమార్‌ హాజరయ్యారు. పిల్లల సమగ్రాభివృద్దికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల కృషి కూడా ముఖ్యమన్నారు. అనంతరం పదోతరగతి విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను వివరించారు. విద్యాకమిటీ చైర్మన్‌ శ్రీనివాసులు, కిరణ్‌, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

రాష్ట్రంలో నాణ్యమైన విద్య

కర్నూలు రూరల్‌ డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): టీడీపీ వచ్చాక రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమై విద్య అందిస్తున్నట్లు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. దిన్నెదేవరపాడు శివారులోని అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం పీటీఎం కార్యక్రమానికి హాజర య్యారు. ముందుగా అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. కోడుమూరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, బడిలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యా యులకు సహకరించాలని కోరారు. విద్యార్థులు తయారు చేసిన త్రీడి ప్రింటింగ్‌, సర్వీంగ్‌ రోబో, గ్రీన్‌ ఎనర్జీ, స్ట్రీట్‌ లైట్‌, రోబో రెస్టారెంట్‌ నమూనాలను ఎమ్మెల్యే పరిశీలిం చారు. గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్‌ డా.శ్రీదేవి, ప్రిన్సిపాల్‌ నిర్మల, పర్యాటక అధికారి లక్ష్మినారాయణ పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:57 AM