భయం భయంగా..
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:48 PM
మండలంలోని గూళ్యం గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాల తరగతి గదుల పైకప్పు పెచ్చులూడుతుండటంతో విద్యార్థులు భయం భయంగా చదువుతున్నారు
హాలహర్వి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గూళ్యం గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాల తరగతి గదుల పైకప్పు పెచ్చులూడుతుండటంతో విద్యార్థులు భయం భయంగా చదువుతున్నారు. ఇక్కడ 6 నుంచి 10వ తరగతి వరకు కన్నడ, తెలుగు మాధ్యమాల్లో బోధిస్తున్నారు. వెయ్యి మంది విద్యార్థులు ఉండగా మూడు గదులు పెచ్చులూడుతున్నాయి. అదనపు గదులు లేకపోడంతో పెచ్చులూడుతున్న గదిలోనే చదువుకుంటున్నారు. పెచ్చులూడితే ప్రమాదమని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.