Share News

వాత్సల్యమూర్తులు

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:11 AM

అమృతాన్ని పంచేది అమ్మ.. అనురాగాన్ని అందించేది నాన్న. తల్లిదండ్రులు పంచే ఆప్యాయత భూప్రపంచంలోనే వెలకట్టలేనిది. మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తల్లిదండ్రుల పాత్రను వివరిస్తూ జూలై 4వ ఆదివారాన్ని తల్లిదండ్రుల దినోత్సవంగా జరుపుకోవడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. 1994లో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ ఫాదర్స్‌డే, మదర్స్‌డేలను రద్దు చేసి తల్లిదండ్రుల విషయంలో లింగబేధం ఉండరాదన్న ఉద్దేశ్యంతో తల్లిదండ్రుల దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించగా ఆదేశ సుప్రీం కోర్టు ఇందుకు అంగీకరించింది. మనదేశంలో కూడా జూలై 4వ ఆదివారాన్ని తల్లిదండ్రుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆంధ్రజ్యోతి’ పాఠకుల కోసం ప్రత్యేక కథనం.

వాత్సల్యమూర్తులు

పిల్లల సంతోషమే కోసమే..

పాశ్చాత్య పోకడలతో తల్లిదండ్రులపై తగ్గుతున్న ఆప్యాయత

వృద్ధులకు అండగా నిలిచిన దేశ అత్యున్నత న్యాయస్థానం

నేడు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం

ఆత్మకూరు, జూలై 26(ఆంధ్రజ్యోతి): మమతానురాగాలకు ప్రతిరూపాలు తల్లిదండ్రులు. సమాజంలో తల్లిదండ్రులకు ఉన్నతమైన పాత్ర ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాల్సిన కనీస విషయాలను తెలియపర్చాల్సిన అవసరం ఉంది. సమాజంలో తల్లిదండ్రులకు, గురువులకు, కుటుంబానికి, మన చుట్టూ వుంటే బాహ్య ప్రపంచానికి ఏరకమైన గౌరవాన్ని అందించాలన్న విషయాలను పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలి. ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే వారిపై చూపించాల్సిన ప్రేమానురాగాలను పిల్లలు గ్రహించే సేవలు అందించాలి.

ప్రతి ఒక్కరూ బాధ్యతగా..

వృత్తి, సామాజిక, ఆర్థిక పరంగా అనే ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ జీవిత చరమాంకంలో తల్లిదండ్రులపై ప్రతిఒక్కరూ బాధ్యతగా మెలగాలి. వృద్ధ్యాప్యంలో ఒక తోడుకోసం.. ఓ తియ్యని మాట కోసం అల్లాడిపోయే తల్లిదండ్రులకు అప్యాయతను పంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రుల దినోత్సవ ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరూ అమృతమూర్తులైన అమ్మనాన్నల పట్ల ఆదరణ చూపుతారని ఆశిద్దాం.

వృద్ధులకు అండగా..

భారతదేశ సమాజంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో చిన్నకుటుంబాలు ఎక్కువై పోయాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి అధికం కావడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సంపాదన లేని తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ, పోషణ కోసం చొరవ తీసుకుంది. ఇందుకుగానూ 2007లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మెయిన్‌టెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ పేరేంట్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌-2007 పేరుతో ఓ చట్టాన్ని ప్రవేశపెట్టింది.

తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం..

తల్లిదండ్రులను చరమాంకంలో కంటిరెప్పలా సంరక్షించాల్సిన బాధ్యత పిల్లలపైనే ఉంది. ఇటీవల తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోని సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. తల్లిదండ్రులను గౌరవించే విధానాలు చిన్నతనం నుంచే పిల్లలు అలవర్చుకోవాలి. నాగరాజు, హెచ్‌ఎం,

ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆత్మకూరు

Updated Date - Jul 27 , 2025 | 12:11 AM