పరిశ్రమల స్థాపనకు వేగంగా అనుమతులు : కలెక్టర్
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:02 AM
పరిశ్రమల స్థాపనకు వీలుగా ఆయా శాఖలు నిర్దేశించిన గడువులోపు అనుమ తు లను వేగంగా మంజూరు చేయాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికా రులను ఆదేశిం చారు.
కర్నూలు కలెక్టరేట్, జూలై 31 (ఆంధ్ర జ్యోతి): పరిశ్రమల స్థాపనకు వీలుగా ఆయా శాఖలు నిర్దేశించిన గడువులోపు అనుమ తు లను వేగంగా మంజూరు చేయాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికా రులను ఆదేశిం చారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌లో హాలులో డిస్ర్టిక్ట్ ఇండ స్ర్టీరియల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా మే 30వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు 870 దరఖాస్తులు రాగా, 858 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందన్నారు. మిగిలిన 12 దరఖాస్తులకు కూడా గడువులోపు అనుమతులను మం జూరు చేయా లన్నారు. పీఎం విశ్వకర్మకు సంబంధించి 1,234 దరఖా స్తులు మంజూ రు కాగా, ఇందులో 989 యూనిట్లకు రుణాలు మంజూ రు చేయడం జరిగిందన్నారు. కల్లూరు ఇండస్ర్టిరియల్ ఎస్టేట్‌కు నీటి సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఆమోదం:
పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లో భాగంగా 12 క్లెయిమ్‌లకు రూ.26.22,000కు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా పెట్టుబడి రాయితీ కింద 12 క్లెయిమ్స్‌కు రూ.26,22,398 పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద ఆమోదం తెలిపారు. కేటగిరీల వారీగా జనరల్ కేటగిరీలకు 10, ఎస్సీలకు 2, మొత్తంగా 12 మందికి ప్రోత్సాహకాలు మంజూరు చేశా మని కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం జవహర్‌బాబు, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.