జింకల బెడదతో రైతుల బెంబేలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:53 AM
జింకల బెడతో రైతులు బెంబేలెత్తుతున్నారు. మండలంలోని అమీనాబాదు, గిరిగిట్ల, రాతన, తుగ్గలి తదితర గ్రామాల్లో వీటి బెడద అధికంగా ఉందని వాపోతున్నారు
తుగ్గలి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): జింకల బెడతో రైతులు బెంబేలెత్తుతున్నారు. మండలంలోని అమీనాబాదు, గిరిగిట్ల, రాతన, తుగ్గలి తదితర గ్రామాల్లో వీటి బెడద అధికంగా ఉందని వాపోతున్నారు. మందలు మందలుగా పంటలపై దాడిచేసి ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన వేరుశనగ, కంది, సజ్జ పంటలను నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు. వీటి బారి నుంచి పంటలను రక్షించుకునేందు కాపాలా ఉండాల్సి వస్తోందని, పొలాల చుట్టూ కాగితాలు, చీరలతో రక్షణ వలయాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి, జింకల బారి నుంచి తమ పంటలను కాపాడాలని కోరుతున్నారు.