రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఏడీఏ
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:38 AM
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఏడీఏ సుధాకర్ అన్నారు.
ఉయ్యాలవాడ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఏడీఏ సుధాకర్ అన్నారు. రైతన్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా బుధవారం పడిగెపాడు గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి రైతుల వివరాలు సేకరించి, వ్యవసాయంపై అవగాహన కల్పించారు. వ్యవసాయ పద్ధతులు, సాగుపై ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు కవిత, రవిప్రకా ష్‌రెడ్డి, రమాదేవిలు రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకుడు కూడాల నారాయణరెడ్డి, వీఆర్వో దాదా, ఎంపీఈవో ప్రసాద్ ఉన్నారు.