రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:41 AM
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు.
ప్యాపిలి, జూన 5 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని పశుసంవర్థకశాఖ కార్యాలయంలో ఆయన రైతులకు పశు దాణా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయానికి వెళ్లి మహిళలతో మాట్లాడారు. స్థానిక ప్రభుత్వ విశ్రాంతి భవనం ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం కోట్ల మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో తల్లికి వందనం, అన్నదాత సు ఖీభవ నిధులు తల్లుల, రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారన్నారు. నియోజకవర్గంలోని ప్యాపిలి, డోన, బేతంచెర్ల మండలాల్లోని 11 గ్రామా లకు కొత్తగా సెల్‌టవర్లు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు భారతి, ఎంపీడీవో శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణయాదవ్, టిశ్రీనివాసులు, ఖాజాపీర్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఆరోగ్యాంధ్రప్రదేశే లక్ష్యం: ఆరోగ్యాంధ్రప్రదేశే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం శ్రమిస్తుందని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మం జూరైన రూ.66,73,834 విలువైన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.