Share News

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం: మంత్రి

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:36 PM

ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం: మంత్రి
మార్కెట్‌ యార్డు చైర్మన్‌ హరిబాబుతో కలిసి పత్తిని పరిశీలిస్తున్న మంత్రి ఫరూక్‌

నంద్యాల రూరల్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. పట్టణ సమీపంలోని మురారి కాటన్‌ మిల్‌లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొను గోలు కేంద్రాన్ని మార్కెట్‌ యార్డు చైర్మెన్‌ గుంటుపల్లి హరిబాబులో కలిసి సోమవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రైతులు పండించిన పత్తి పంటకు సరైన మద్దతు ధర లభించేలా కొనుగోలు కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. దళారుల వ్యవస్థను తొలగించి పారదర్శకతతో కూడిన కొనుగోళ్లను ప్రోత్సహించడమే ఈ కేంద్రాల ప్రధాన లక్ష్యమని అన్నారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు ఎన్‌ఎండీ ఫయాజ్‌, చాబోలు ఇలియాజ్‌, రంగప్రసాద్‌, పబ్బతి రవి, విజయగౌరి, కాల్వ శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 11:37 PM