Share News

రైతుల ఎదురుచూపులు

ABN , Publish Date - May 17 , 2025 | 11:50 PM

సొసైటీల నుంచి రుణాలు తీసుకుని వాటిని సకాలంలో చెల్లించే రైతుల కోసం ప్రభుత్వం వడ్డీ రాయితీని అమలు చేస్తోంది. ఆలూరు పరిధిలో 5 సొసైటీలు ఉండగా, రైతులకు ఇచ్చేందుకు రూ.53.85 లక్షలు మంజూరు చేసింది.

రైతుల ఎదురుచూపులు
ఆలూరు విశాల సహకార పరపతి సంఘం

అన్నదాతలకు అందని వడ్డీ రాయితీ

ప్రభుత్వం నిధులు ఇచ్చినా జమచేయని అధికారులు

ఆలూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): సొసైటీల నుంచి రుణాలు తీసుకుని వాటిని సకాలంలో చెల్లించే రైతుల కోసం ప్రభుత్వం వడ్డీ రాయితీని అమలు చేస్తోంది. ఆలూరు పరిధిలో 5 సొసైటీలు ఉండగా, రైతులకు ఇచ్చేందుకు రూ.53.85 లక్షలు మంజూరు చేసింది. అయితే అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా రాయితీ రైతులకు చేరడం లేదు. ఆలూరు, బెల్డోణ, హొళగుంద, చింతకుంట, ఆస్పరి సొసైటీల పరిధిలో మొత్తం 10 వేలకు పైగా రైతులు

ఉన్నారు. వీరికి ఏటా రైతులు తీసుకున్న పావలా వడ్డీ రుణాలకు సంబంధించి మార్చి 31 నాటికి సక్రమంగా వడ్డీ చెల్లించిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 4 శాతం వడ్డీ రాయితీని తిరిగి చెల్లిస్తుంది. ఈ లెక్కన 5 సొసైటీలకు మొత్తం రూ.53.85 లక్షలు కేంద్ర సహకార బ్యాంకుకు జమ అయ్యాయి. అయితే ఆ డబ్బును సొసైటీల వారీగా ఏ రైతుకు ఎంత వడ్డీ రాయితీ వస్తుందో లెక్క గట్టి రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో అమలు కావడం లేదు. అధికారులు ఇంకా లెక్కలు వేసే పనిలోనే ఉన్నారు. ఇప్పటికైనా వడ్డీ రాయితీ తమకు అందించాలని రైతులు కోరుతున్నారు.

త్వరలోనే సొసైటీలకు జమచేస్తాం

ఆలూరు పరిధిలోని 5 సొసైటీలకు వడ్డీ రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.5.85లక్షలు జమ చేసింది. వీటిని సంబంధిత సొసైటీల ఖాతాల్లోకి జమ చేస్తాం. సొసైటీ సీఈవోలు లెక్కలు కట్టి రైతుల ఖాతాల్లోకి జమచేసే విధంగా చూస్తాం. - రవిప్రకాష్‌, మేనేజర్‌, కేంద్ర సహకార బ్యాంకు

Updated Date - May 17 , 2025 | 11:50 PM