Share News

డ్రోన్‌ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ABN , Publish Date - Aug 01 , 2025 | 12:34 AM

వ్యవసాయ రంగం లో డ్రోన్‌ సాంకేతిక తను రైతులు అందిపుచ్చుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు

డ్రోన్‌ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
రైతులకు డ్రోన్‌లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

80 శాతం సబ్సిడీతో రైతులకు డ్రోన్లు పంపిణీ

కల్లూరు, జూలై 31(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగం లో డ్రోన్‌ సాంకేతిక తను రైతులు అందిపుచ్చుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు. ఆర్‌కేవీవై పథకం 2024-25లో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గంలోని లక్ష్మీపురం, నన్నూరు గ్రామ రైతులకు గురువారం ఎమ్మెల్యే చేతుల మీదుగా 80 శాతం సబ్సిడీతో కిసాన్‌ డ్రోన్లను పంపిణీ చేశారు. మాధవీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సహాయ వ్యవసాయ సంచాలకుడు ఎన్‌. శాలురెడ్డి, కల్లూరు, ఓర్వకల్లు వ్యవసాయ అధికారులు విష్ణువర్ధన్‌రెడ్డి, మధుమతి, నన్నూరు సింగిల్‌విండో అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ ఆధునీకీకరణకు ప్రభు త్వం కృషి చేస్తుందని, డ్రోన్‌ సాంకేతికతతో రైతులు ఎరువులు, పురుగుల మందుల పిచికారి సులభతరం అవుతుందని అన్నారు. డ్రోన్‌ మొత్తం ధర రూ.98వేలు కాగా 80 శాతం సబ్సిడీ రూ.78,0000, రైతువాటా రూ.19,6000తో కిసాన్‌ డ్రోన్‌లను రైతులకు అందజేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 గ్రామస్థాయి కిసాన్‌ సమైఖ్యలను ఏర్పాటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్‌ ఆకెపోగు వెంకటస్వామి, లక్ష్మీపురం మాజీ సర్పంచు పుల్లారెడ్డి, రామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, విజయుడు, శంషుద్దీన్‌, ఖాజామియా, కటిక హాసన్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

చట్టసభల్లో దివ్యాంగుల సమస్యలపై చర్చించండి

దివ్యాంగుల సమస్య లపై చట్టసభల్లో చర్చించాలని జిల్లా దివ్యాంగుల నూతన కమిటీ నాయ కులు ఎమ్మెల్యే గౌరు చరితను అభ్యర్థించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గౌరుచరితను దివ్యాంగుల జిల్లా సంఘం నాయకులు సన్మానించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం, స్వయం ఉపాధి, కృత్రిమ అవయవాలు, పరికరాలు తదితర సమస్యలను చట్టసభల్లో చర్చించి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దివ్యాం గులను ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Updated Date - Aug 01 , 2025 | 12:34 AM