రైతులు ఆందోళన చెందొద్దు
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:54 PM
రైతులు ఆందోళన చెందొద్దు
అందుబాటులో యూరియా
వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రబీ సీజన్‌కు యూరియాను రైతులకు అందుబాటులో ఉంచామని ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడా రు. రబీలో రైతులు సాగుచేసిన పంటలకు అవసరమైన 24,580 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసేం దుకు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఈనెలాఖరుకు మరో మరో 2,075 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వస్తుందన్నారు. ఈయూరియాను కోఆపరేటివ్ సొసైటీ లు, రైతు సేవా కేంద్రాల్లో, మార్క్‌ఫెడ్ గోదాముల్లో, ప్రైవేటు డీలర్ల వద్ద కంపెనీ గోదాముల్లో యూరియాను రైతాంగానికి అందుబాటులో ఉంచామన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎటువంటి ఎరువుల కొరత లేదన్నారు. రైతులు తప్పనిసరిగా ఎరువు బస్తాపై ముద్రించిన ఎంఆర్‌పీ ధరలను సరి చూసుకుని డీలర్లకు అంతే మొత్తాన్ని చెల్లించాలని, రసీదు పొందాలని విజ్ఞప్తి చేశారు.