Share News

రైతులకు మెరుగైన సౌకర్యాలు అందించాలి

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:57 PM

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

రైతులకు మెరుగైన సౌకర్యాలు అందించాలి
సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా సహకార సమన్వయ అఽభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని 56 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు 51 సంఘాల్లో కంప్యూటరీకరణ పూర్తయిందన్నారు. మిగతావి కూడా వారం రోజుల్లో పూర్తి కావాలన్నారు. రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు సహకార, కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ అధికారులు సహకరిం చాలని ఆదేశించారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులు భద్రపరచుకోవడానికి బస్తాకు రూ.4చొప్పున రుసుం చెల్లించేలా నిర్ణయించినమేరకు చర్య లు తీసుకోవాలన్నారు. దీంతో రైతు లకు మేలుతో పాటు సహకార సం ఘాలు కూడా లాభాల బాటలో పయనిస్తాయన్నారు. డ్రోన్ల కొనుగో లుకు రుణాలు మంజూరు చేయా లని ఆదేశించారు. ఈ సమా వేశంలో జిల్లా సహ కార శాఖ అధికారి వెంకట సుబ్బయ్య, నాబార్డు అధికారి సుబ్బారెడ్డి, డీపీఓ షేక్‌ జమీవుల్లా, మత్స్యశాఖ అధికారి రాఘవ రెడ్డి, పశుసంవర్ధకశాఖ అధికారి గోవిందునాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:57 PM