రైతులే ధర నిర్ణయించేలా ఎదగాలి
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:41 PM
పండించిన పంటకు ధర నిర్ణయించే స్థాయికి రైతులు ఎదగాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఆకాంక్షించారు.
964 మంది రైతులకు రూ.1.99 కోట్ల రాయితీ
వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేసిన కలెక్టర్
నంద్యాల నూనెపల్లె, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : పండించిన పంటకు ధర నిర్ణయించే స్థాయికి రైతులు ఎదగాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఆకాంక్షించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో 964మంది చిన్న, సన్నకారు రైతులకు రూ.1.99 కోట్ల వ్యవసాయ పరికరాల రాయితీని ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆమె పేర్కొన్నారు. బుధవారం నంద్యాల కటెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో వ్యవసాయ యాంత్రీకరణ సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెషనైజేషన్ పథకం కింద వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, జిల్లాలోని సహాయ వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. రైతులకు విడుదల చేసిన రూ.1.99కోట్ల రాయితీ నిధుల చెక్కును కలెక్టర్ లబ్ధిదారులకు అందజేశారు.