ఆర్థికాభివృద్ధి దిశగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 10:40 PM
రాష్ట్రంలో ఉన్న రైతు ఉత్పత్తి దారుల సంఘాలు ఆర్థికాభివృద్ధి దిశగా పయ నిస్తున్నాయని రాష్ట్ర సెర్ప్ అడిషనల్ సీఈవో శ్రీరాములునాయుడు అన్నారు.
రాష్ట్రంలో 8.32లక్షల సంఘాలకు రూ.25వేల కోట్ల రుణాలు
సెర్ప్ అడిషనల్ సీఈవో శ్రీరాములునాయుడు
జూపాడుబంగ్లా, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో ఉన్న రైతు ఉత్పత్తి దారుల సంఘాలు ఆర్థికాభివృద్ధి దిశగా పయ నిస్తున్నాయని రాష్ట్ర సెర్ప్ అడిషనల్ సీఈవో శ్రీరాములునాయుడు అన్నారు. సోమవారం జూపాడుబంగ్లాలో రైతు ఉత్పత్తి దారులు నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల్లో ఏకార్యక్రమాలు చేపడుతున్నారో ముఖాముఖి చేపట్టి రైతులతో మాట్లాడారు. ఉత్పత్తిదారుల సంఘాల్లో ఉన్న రైతులు ఉత్పత్తిచేసిన పం టల దిగుబడులు గతంలో కందిబేడలను ఎగుమతిచేసి రాష్ట్రంలోను గుర్తింపు ఉన్న జూపాడుబంగ్లా రైతు ఉత్పత్తిదారుల సంఘం నేడు ఎందుకు చేయలేకపోతుందని అధికారులపై మండిపడ్డారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను గుర్తించి వారిని ప్రావీణ్యం ఉన్న ఉత్పత్తులను తయారు చేసే విధంగా చేపట్టిన సర్వేలో కూడా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే పునావృతం అయితే సీఆర్‌పీలను తొలగిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అల్లూరి, వైఎస్సార్, విజయనగరం, నంద్యాల జిల్లాలో దాదాపు 40సంఘాలు వివిధ రంగాల్లో ఆర్థికాభివృద్ధిదిశగా ముందుకు సాగుతున్నారన్నారు. రాష్ట్రంలో 8.32లక్షల సంఘా లున్నాయని, వీటికి రూ. 25వేల కోట్లు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందించామన్నారు. .3వేల సంఘా లకు రూ.15వేల చొప్పున రివాల్వింగ్‌ఫండ్ అందజేశామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, సెర్ప్ పీఎం శ్రీనివాసులు, ఏపీఎం అంబమ్మ పాల్గొన్నారు.