Share News

క్రీడలకు దూరంగా..

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:17 AM

జొహరాపురం సమీపంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మాస్టర్‌ బాస్టర్‌ క్రికెట్‌ అకాడమీ, ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ అకామీ పర్యవేక్షణ లేకపోవంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి.

క్రీడలకు దూరంగా..
ప్రధాన ద్వారం కుడివైపున ధ్వంసమైన ఇనుప కంచె,

నిర్వహణ మరచిన అధికారులు, ఫీజు పెంచడంతో క్రీడాకారులు దూరం

ఫెన్సింగ్‌ ధ్వసం, సామగ్రి దొంగల పాలు

నగర పాలక సంస్థ క్రికెట్‌ అకాడమీ దుస్థితి

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జొహరాపురం సమీపంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మాస్టర్‌ బాస్టర్‌ క్రికెట్‌ అకాడమీ, ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ అకామీ పర్యవేక్షణ లేకపోవంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. గత వైసీపీ హయాంలో 2023 ఏప్రిల్‌ 20న రూ.80 లక్షలు, నవంబరు 16, 2023లో మరో రూ.80లక్షలు వెచ్చించి కమిషనర్‌ భార్గవ్‌తేజ అధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొన్ని రోజులుపాటు కొంత ఫీజు నిర్ణయించి క్రీడాకారులకు శిక్షణ కూడా ఇచ్చారు.

దొంగతాలు, సామగ్రి ధ్వసం..

ఈ అకాడమీలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరికి నచ్చిన సామగ్రి వారు ఎత్తుకెళుతున్నారు. అలాగే అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మారిందని క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. క్రికెట్‌ అకాడమీ వెల్‌కమ్‌ ఆర్ట్‌కు కుడిపక్కన ఫెన్సింగ్‌ను కొందరు ధ్వసం చేశారు. సాయంత్రం మందుబాబులు తిష్టవేస్తున్నారు. కార్యాలయం గోడలకు పగుళ్లు పడ్డాయి. మరుగుదొడ్డి తలుపులను పగులకొట్టి చిందరవందంరగా చేశారు. సింకులను సైతం పగులగొట్టారు. లాన్‌ టెన్నిస్‌ కోర్టులోని టెన్నిస్‌ పైపులను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు, ్ఞఅవి రాకపోవడంతో వంచేసి వెళ్లిపోయారు. క్రికెట్‌ నెట్స్‌కు పర్యవేక్షణ లేకకపోవడంతో కొందరు పిల్లలు వాటిపై ఆడు కుంటూ పిచ్‌ను పాడుచేస్తున్నారు. నగర పాలక సంస్థ అధికారులు ఓ వైపు నగరమంతా పరిశుభ్రంగా ఉంచా లని ప్రచారాలతో హోరెత్తిస్తూ, అకాడమీని మాత్రం పట్టించుకోవడం లేదని క్రీడాకారులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఫీజుల పెంపుతో క్రీడాకారులు దూరం..

ప్రారంభంలో కొంత ఉన్న ఫీజులు పెంచేయడంతో క్రీడాకారులు ఇక్కడికి రావడం లేదు. దీంతో ఇక్కడ అకాడమీలు ఉన్నాయన్న విషయం మరుగున పడింది. అనంతరం ఫిర్యాదులు అందినా నగర పాలక సంస్థ అధికారులు ఎవ్వరు పట్టించుకోలేదు.

లీజుదారులు రావడం లేదు

అకాడమీలోని క్రికెట్‌, టెన్నిస్‌ మైదానాల పర్యవేక్షణ లీజు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. లీజు కుదిరితే స్టేడియంను ఆధునీకరించి, అందుబాటులోకి తీసుకువస్తాం. చిన్న చిన్న మరమ్మత్తులు చేయించాలాని ఇప్పటికే అధికారులను ఆదేశించాము. - ఆర్‌జీవీ కృష్ణ, ఇన్‌చార్జి కమిషనర్‌

తక్కువ ఫీజు వసూలు చేయాలి

క్రికెట్‌ సాధన చేసేందుకు ఫీజు తక్కువగా ఉంటే మేలు. ఎక్కువ ఫీజలతో ఇక్కడికి ఎవరూ రావడం లేదు. స్టేడియా నికి మరమ్మతులు చేయించాలి. - బి.సజీవకుమార్‌, క్రీడాకారుడు

Updated Date - Dec 30 , 2025 | 01:18 AM