Share News

అభివృద్ధికి దూరం

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:02 AM

మండలంలో 24 గ్రామాలు, 15 పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీలు అభివృద్ధికి దూరంగా వున్నాయి

అభివృద్ధికి దూరం
బల్లూరు గ్రామంలో మరుగుతో నిండిన రోడ్డును చూపుతున్న గ్రామస్థుడు

పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయని ప్రభుత్వం

హాలహర్వి మండలంలో పారిశుధ్య పనులకూ డబ్బుల్లేవు?

హాలహర్వి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలో 24 గ్రామాలు, 15 పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీలు అభివృద్ధికి దూరంగా వున్నాయి. కనీసం పారిశుధ్య పునలను కూడా చేసుకోలేని దీనస్థితికి చేరుకున్నారు. గూళ్యం, విరుపాపురం, సిద్ధాపురం, బల్లూరు, చింతకుంట, బలగోట తదితర గ్రామాల్లో ఏ వీధిలో చూసిన రోడ్లన్నీ బురదమయంతో దుర్వాసన వస్తోంది. బయటికి రావాలంటేనే జంకుతు న్నారు. తప్పని పరిస్థితి అయితే ముక్కు మూసుకుని రోడ్లను దాటాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిద్ధాపురం పంచాయతీ మజరా గ్రామం బల్లూరు గ్రామంలో గ్రామంలో 300 గృహాలు ఉండగా, ఏ వీధికి వెళ్లినా కంపు కొడుతూనే ఉన్నాయి. కనీసం నడిం చేందుకు కూడా వీలు లేదని మహి ళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇంత దురవస్థలు పడుతున్నా సర్పంచ్‌, కార్యదర్శిగానీ తమ గ్రామంవైపు ఆరు నెలల నుంచి కన్నెత్తి చూడదని గ్రామస్థులు ఆరోపిస్తు న్నారు. ఉన్నతాధికారులు స్పందింది, తమ గ్రామానికి నిధులు విడుదల చేసి, పారిశుధ్య పనులు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పంచాయతీలకు నిధులు ఇవ్వాలి

ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు పంచాయతీకి పైసా కూడా ఇవ్వలేదు. 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేకపోవడంతో సమస్యలు పరిష్క రించలేకున్నాం. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వంలోనూ మొండిచేయి మిగులుతుందని ఆందోళన చెందుతున్నాం. - మన్మధరెడ్డి, సర్పంచ్‌, కొక్కరచేడు

పారిశుధ్య పనులకు చర్యలు

పంచాయతీలకు నిధులు కొరత వాస్తవమే. 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది. పారిశుధ్య నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. వైద్యులతో మాట్లాడి వ్యాధులు ప్రబలకుండా చూస్తాం. - నాగరాజు, డిప్యూటీ ఎంపీడీవో, హాలహర్వి

Updated Date - Aug 18 , 2025 | 12:02 AM