Share News

మదర్సాలపై తప్పుడు ప్రచారం తగదు

ABN , Publish Date - Jun 15 , 2025 | 12:04 AM

పట్టణంలోని మదర్సా లపై కొందరు తప్పుడు ప్రచారం తగదని రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు సూరి మన్సూర్‌ ఆలీఖాన పేర్కొన్నారు.

మదర్సాలపై తప్పుడు ప్రచారం తగదు
మాట్లాడుతున్న సూరి మన్సూర్‌ ఆలీఖాన

కర్నూలు అర్బన, జూన 14(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మదర్సా లపై కొందరు తప్పుడు ప్రచారం తగదని రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు సూరి మన్సూర్‌ ఆలీఖాన పేర్కొన్నారు. శనివారం రోజా వీధిలో మదర్సా వద్ద రోజా మసీదు ప్రపోజ్డ్‌ కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయంలో రోజా వీధిలో ఉన్న మదర్సా నిర్వహణ గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మదర్సాలు, మసీదుల అభివృద్దికి కృషి చేస్తోందన్నారు. రోజా విధిలోని మదర్సా ద్వారా ఆదాయం పొందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే వక్స్‌ బోర్డు అధికారులను సంప్రందించి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. మదర్సా ద్వారా వచ్చే ఆదాయాన్ని రోజామసీదు నిర్వహణకు ఉపయోగించాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. ప్రతినెలా రోజా మసీదు నిర్వహణకు రూ.20వేల నుంచి రూ.25వేల దాక ఖర్చువుతుం దన్నారు. కొందరు గిట్టని వ్యక్తులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈతప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మెద్దని ఆయన కోరారు.

Updated Date - Jun 15 , 2025 | 12:04 AM