వైసీపీ ఎమ్మెల్యేల అసత్య ఆరోపణలు
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:02 AM
: వైసీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసు ్తన్నారని, ఇది మంచి పద్ధతికాదని ఎమ్మెల్యే పార్థసారథి హితవు పలికారు.
ఆదోని, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసు ్తన్నారని, ఇది మంచి పద్ధతికాదని ఎమ్మెల్యే పార్థసారథి హితవు పలికారు. మంగళవారం స్థానిక ఇంటర్నేషనల్ ఫంక్షన్‌హాల్‌లో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన ఇన్‌చార్జి మల్లప్ప ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బి.టి.నాయుడు, కురువ కార్పొరేషన చైర్మన్ దేవేంద్రప్ప, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, విట్టా రమేష్, గుడిసె కృష్ణమ్మ, భాస్కర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, భూపాల్‌చౌదరి హాజరయ్యారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేసి, అనంతరం రక్తదానం చేశారు. వైసీపీ నాయకులపై ప్రజలు ఓటుతో బుద్ధిచెప్పి 11 సీట్లు మాత్రమే ఇచ్చినా బుద్ధి రాకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈనెల 18న జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకావాలని సూచించారు. జనసేన నాయకులు రేణువర్మ, రాజశేఖర్ పాల్గొన్నారు.