పతనమైన పత్తి ధరలు
ABN , Publish Date - Dec 01 , 2025 | 11:26 PM
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు సోమవారం స్వల్పంగా పతనమయ్యాయి. పత్తి ధర గరిష్టంగా క్వింటం రూ.7,429 పలికింది.
క్వింటం రూ.7,429
ఆదోని అగ్రికల్చర్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు సోమవారం స్వల్పంగా పతనమయ్యాయి. పత్తి ధర గరిష్టంగా క్వింటం రూ.7,429 పలికింది. మళ్లీ ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస ధర కంటే మార్కెట్లో పలుకుతున్న ధర క్వింటాకు రూ.1,200 కంటే తక్కువ పలుకుతోంది. ఇదిలా ఉండగా సీసీఐకి అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ కాకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. స్లాట్ బుకింగ్ సమస్యను పరిష్కరిస్తే సీసీఐకి విక్రయించుకుంటామని రైతులు అంటున్నారు. కాగా సోమవారం మార్కెట్‌కు 6,553 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా, కనిష్ట ధర రూ.4,099, మధ్యస్థంగా రూ.7,201, గరిష్టంగా రూ.7,429 పలికింది.