పత్తి ధర పతనం
ABN , Publish Date - Oct 11 , 2025 | 10:42 PM
: ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర మరింత పతనమైంది. శనివారం పత్తి ధర క్వింటాల్ గరిష్ఠంగా రూ.7,499 ఉన్నాయి.
క్వింటాల్ గరిష్ఠం రూ.7,499
దిగాలు చెందుతున్న రైతులు
ఆదోని అగ్రికల్చర్, అక్టోబర్ 11(ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర మరింత పతనమైంది. శనివారం పత్తి ధర క్వింటాల్ గరిష్ఠంగా రూ.7,499 ఉన్నాయి. ఐదు రోజుల క్రితం స్వల్పంగా పెరిగిన ధరలు మళ్లీ దిగజారడంపై పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల్లోపే పత్తి ధర క్వింటానికి రూ. 350 పైగా ధర తగ్గింది. ఎడతెరిపిలేని వర్షాలు తగ్గి ఎండలు కాస్తుండడంతో రైతులు కోతకు వచ్చిన పత్తి మర్కెట్ కమిటీకి విక్రయానికి భారీగా తీసుకొస్తున్నారు. ధరలు పతనం కావడంపై రైతులు దిగాలు చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దూది ధరలు తగ్గడంతో ఆ ప్రభావం స్థానిక మార్కెట్ యార్డులో ధరలు తగ్గడానికి కారణమని పత్తి వ్యాపారులు చెబుతున్నారు. 11,889 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ.3,960, మధ్యధర రూ.7,299, గరిష్ఠధర రూ.7,499 పలికింది.