నకిలీ లేఖల బాగోతం బట్టబయలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:12 AM
నకిలీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రజాప్రతినిధుల పేర్లతో లేఖలు సృష్టించాడు ఓ కేటుగాడు.
ప్రజాప్రతినిధుల పేర్లతో నకిలీ లెటర్లు తయారీ
టీటీడీ దర్శనం, ఉద్యోగుల బదిలీలకు అమ్మకాలు
ఫిర్యాదు చేసిన ఎంపీ పీఏ
పోలీసులు అదుపులో నిందితుడు
నంద్యాల టౌన్, ఆగస్టు14 (ఆంధ్రజ్యోతి): నకిలీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రజాప్రతినిధుల పేర్లతో లేఖలు సృష్టించాడు ఓ కేటుగాడు. తిరుపతిలో అతని లేఖ ద్వారా మోసపోయిన బాధితులు నంద్యాల ఎంపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అతడి బా గోతం బట్టబయలు అ య్యింది. ఎంపీ పీఏ పోలీసులకు సమాచా రమిచ్చినట్లు నంద్యాల వన్‌టౌన్ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. వివరాలు.. వెలుగోడు మండలం గుంతకందనాలకి చెందిన వెంకటేశ్వర్లు అనే యువకుడు నంద్యాలలోని బైర్మల్ వీధిలోని ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీల లెటర్లు పోలి ఉండేలా నకిలీలెటర్లు తయారుచేసి సన్నిహితుల ద్వారా అమ్ముకుంటున్నాడు. నెల్లూరుకు చెందిన చంద్రకళ అనే మహిళలకు బుధవారం టీటీడీ దర్శ నం కోసం నంద్యాల ఎంపీ లెటర్‌ను నకిలీ తయారు చేసి అమ్మాడు. వారు తిరుపతి వెళ్లగా అక్కడ ఇది నకిలీ లెటర్ అని తేలింది. ఆమె నంద్యాల లోని ఎంపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎంపీ పీఏ బైరెడ్డి దినేశ్‌రెడ్డి గురువారం పో లీసులకు సమాచారమివ్వగా నిందితుడిని పట్టుకున్నారు. వెంకటేశ్వర్లు అన్న రమణ స్నేహి తుడు రవితేజ ద్వారా నెల్లూరు వ్యక్తులకు నకిలీ లెటర్లు ఇచ్చాడు. అద్దెకు తీసుకున్న గదిలో, సొంతూరు గుంతకందనాల గ్రామంలో కూడా పోలీసులు సోదాలు చేశారు. ఎంపీ పీఏ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.