Share News

ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేయకుంటే గైర్హాజరుగా పరిగణిస్తాం

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:26 AM

ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు, సిబ్బంది ఎఫ్‌ఆర్‌సీ హాజరు వేయకుంటే గైర్హాజరుగా పరిగణిస్తామని హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డా.వెంకటేశ్వర్లు హెచ్చరించారు

ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేయకుంటే గైర్హాజరుగా పరిగణిస్తాం
మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా. వెంకటేశ్వర్లు

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు, సిబ్బంది ఎఫ్‌ఆర్‌సీ హాజరు వేయకుంటే గైర్హాజరుగా పరిగణిస్తామని హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డా.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గురువారం ధన్వంతరి హాలులో ఆయన వివిధ విభాగాల హెచ్‌వోడీలతో సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి అకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది హాజరును నమోదు చేయాలని, ఆసుపత్రిలో సెక్యూరిటీ సేవలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ సూపరింటెండెంట్లు డా.లక్ష్మిబాయి, డా.నాగేశ్వరరావు, సీఎస్‌ఆర్‌ఎంవో డా.పద్మజ పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:26 AM