హామీలు నెరవేర్చడంలో విఫలం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:13 AM
హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆరోపించారు. బుధవారం పట్టణంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు వెన్నుపోటు నిరసనలో భాగంగా ర్యాలీ నిర్వహించారు.
ఆలూరు, జూన్4(ఆంధ్రజ్యోతి): హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆరోపించారు. బుధవారం పట్టణంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు వెన్నుపోటు నిరసనలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ గోవింద్‌సింగ్‌కు వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీలను ఎంతవరకు అమలు చేశారని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఏమైందని ప్రశ్నించారు. సూపర్‌సిక్స్ పథకాలు అమలను చేయకుండా ప్రజలను దగా చేశారని ఆరోపిం చారు. వైకుంఠం మల్లికార్జున, జనార్ధన్‌నాయుడు, కృష్ణమోహన్, జెడ్పీటీసీలు కిట్టు, దొరబాబు, మండల కన్వీనర్లు మారయ్య, మల్లికార్జున, లుమాంబ, రామిరెడ్డి, షఫీఉల్లా, నాయకులు సుంకర రామాంజనేయులు, గోవర్ధన్, చిన్న ఈరన్న, అరికెర వెంకటేష్, బాషా, భాస్కర్, అరికెర ఉరుకుందు, శ్రీనివాసులు, వీరేష్, శేషప్ప, నాగప్ప, మల్లికార్జున, గిరి, దర్గన్న తదితరులు పాల్గొన్నారు