Share News

విద్యార్థులకు కంటి పరీక్షలు

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:17 PM

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలోని 6 నుంచి 18 సంవత్సరాల బాలబాలికలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్‌ డాక్టర్‌ ఎం.సంధ్యారెడ్డి తెలిపారు.

విద్యార్థులకు కంటి పరీక్షలు
కంటి పరీక్షలను ప్రారంభిస్తున్న జిల్లా అంధత్వ నివారణ అధికారిణి డా.సంద్యారెడ్డి

కర్నూలు హాస్పిటల్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలోని 6 నుంచి 18 సంవత్సరాల బాలబాలికలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్‌ డాక్టర్‌ ఎం.సంధ్యారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం కర్నూలు నగరంలోని మిలటరీ కాలనీ హైస్కూల్‌లో కంటి పరీక్షలను ఆమె ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 40 వేల మంది విద్యార్థులకు 3 నెలల్లో కంటి పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ పరీక్షల్లో దృష్టి లోపాలున్న వారికి చికిత్సలు చేసి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. కంటి పరీక్షలను పారా మెడికల్‌ ఆప్తాలిక్‌ అధికారుల సమక్షంలో నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు.

Updated Date - Jul 22 , 2025 | 11:17 PM